- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Vijayan: రష్యాలో చిక్కుకున్న కేరళ వాసులను రక్షించాలి.. కేంద్రానికి సీఎం విజయన్ విజ్ఞప్తి
దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగాల కుంభకోణంలో మోసపోయి రష్యాలో చిక్కుకుపోయిన కేరళ వాసులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు శుక్రవారం లేఖ రాశారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో డ్రోన్ దాడిలో మరణించిన త్రిసూర్‌కు చెందిన సందీప్ చంద్రన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి జోక్యం చేసుకోవాలని కోరారు. సందీప్ మృతదేహం రష్యాలోని రోస్టోవ్‌లో ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం ధృవీకరించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాల వెల్లడించారు. లుహాన్స్క్‌లోని సైనిక శిబిరంలో పలువురు కేరళ ప్రజలు చిక్కుకుపోయారని, అక్కడ వారు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని రక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని సూచించారు. అలాగే అనధికారిక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా మోసపోయి రష్యాలో చిక్కుకున్న వారి సంఖ్యపై దర్యాప్తు చేయాలని తెలిపారు.