ఇది కో ఆపరేటివ్ ఫెడరిలిజమా?- స్టాలిన్

by Shamantha N |
ఇది కో ఆపరేటివ్ ఫెడరిలిజమా?- స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిని నీతి ఆయోగ్ సమావేశంలో తాను ప్రసంగిస్తుండగానే మైక్ కట్ చేసినట్లు దీదీ ఆరోపించారు. కాగా.. దీనిపైనే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్టాలిన్ స్పందించారు. మమతా మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ప్రశ్నించారు. కో ఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాధించాలంటే చర్చలు అవసరం అని అన్నారు. ముఖ్యమంత్రి పట్ల వ్యవహిరించే తీరు ఇదేనా? అని అడిగారు. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని గుర్తించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను శక్తువులగా భావించవద్దని కేంద్రంలోని బీజేపీ అర్థం చేసుకోవాలని అన్నారు.

నీతి ఆయోగ్ భేటీని బైకాట్ చేసిన సీఎంలు

అంతకుముందు రోజు, స్టాలిన్ కేంద్ర బడ్జెట్‌ గురించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలు, ప్రజలపై బడ్జెట్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు కన్పిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రగతిశీల ఆలోచనలకు విరుద్ధమైన చర్యలు కొనసాగిస్తూనే ఉందని ఓ వీడియోను విడుదల చేశారు. ఇకపోతే, నీతి ఆయోగ్ సమావేశాన్ని తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు బహిష్కరించారు. కేంద్రబడ్జెట్ ప్రజలపై వివక్ష చూపించేలా ఉందని మీటింగ్ ని బైకాట్ చేశారు. కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సమావేశానికి హాజరయ్యారు. కాకపోతే, భేటీ మధ్యలోనే వాకౌట్ చేశారు. తాను ప్రసంగిస్తుండగానే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు.


Advertisement

Next Story

Most Viewed