Cm shinde: బద్లాపూర్ నిరసనల వెనుక రాజకీయ కుట్ర.. సీఎం ఏక్‌నాథ్ షిండే

by vinod kumar |
Cm shinde: బద్లాపూర్ నిరసనల వెనుక రాజకీయ కుట్ర.. సీఎం ఏక్‌నాథ్ షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో: థానే జిల్లాలోని బద్లాపూర్‌లో జరిగిన నిరసనలు రాజకీయ ప్రేరేపితమని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆరోపించారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది బయటి వ్యక్తులేనని వెల్లడించారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇద్దరు పిల్లలపై లైంగిక దాడి ఆరోపణలు వస్తే ఈ దారుణ ఘటనపై రాజకీయాలు చేస్తున్నవారు సిగ్గుపడాలన్నారు. నిరసనలో భాగమైన స్థానిక నివాసితులను వేళ్లపై లెక్కించొచ్చని చెప్పారు. రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆందోళన చేస్తున్న వారి అన్ని డిమాండ్లకు అంగీకరించారని అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడం సరికాదన్నారు.

కాగా, ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రాగా ఈ ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం భారీ ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు బద్లాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బుధవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే 72 మందిని అరెస్ట్ చేశారు. బద్లాపూర్ అంతటా భారీగా భద్రతను మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed