- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cm Nitish: బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రి వర్గంలోకి ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) బుధవారం తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో జిబేష్ కుమార్ , సంజయ్ సరోగి, సునీల్ కుమార్, రాజు కుమార్ సింగ్, మోతీ లాల్ ప్రసాద్, విజయ్ కుమార్ మండల్, కృష్ణ కుమార్ మంటూ ఉన్నారు. వీరంతా బీజేపీ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. కొత్తగా ఎన్నికైన మంత్రులతో గవర్నర్ మహహ్మద్ ఆరిఫ్ ఖాన్ (Aareef khan) రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించారు. వీరి చేరికతో రాష్ట్రంలోని మంత్రుల సంఖ్య 36కు చేరుకుంది.వీరిలో 21 మంది బీజేపీ, 13 మంది జేడీయూ, ఒకరు హెచ్‌ఏఎం, ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
కాగా, ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీహార్‌లో మొత్తం 243 సీట్లు ఉండగా ఎన్డీఏ కూటమికి 131 సీట్లు ఉన్నాయి. రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని సామాజిక వర్గాల వారిగా మంత్రులకు చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు ముందు బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి దిలీప్ జైస్వాల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.