ఒడిషా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం: CM మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-03 07:52:55.0  )
ఒడిషా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం: CM మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో శుక్రవారం రాత్రి జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఒడిషా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు.

ఇక, శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిషాలోని బాలాసోర్‌కు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 280 మంది మృతి చెందగా.. మరో 900 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక, ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story