‘ఎన్నాళ్లు ఉంటుందో చూస్తా’.. NDA సర్కార్‌పై CM మమతా సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-06-08 13:51:46.0  )
‘ఎన్నాళ్లు ఉంటుందో చూస్తా’.. NDA సర్కార్‌పై CM మమతా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమి రెడీ అవుతోంది. అయితే, బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో మిత్ర పక్షాలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి మరోసారి సెంట్రల్‌లో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు సిద్ధమైంది. మోడీని లోక్ సభ పక్ష నేతగా ఎన్డీఏ కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మూడోసారి భారత ప్రధానిగా ఈ నెల 9న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఓ సమావేశంలో దీదీ మాట్లాడుతూ.. మిత్ర పక్షాల సహయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చూస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సెంట్రల్‌లో ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ తర్వాత పరిస్థితి మారొచ్చని దీదీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను రద్దు చేయాలని పార్లమెంట్ వేదికగా మోడీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కాబోయే ఎన్డీఏ ప్రభుత్వం పక్షపాతం చూపకుండా అన్ని రాష్ట్రాలకు పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీ 29 ఎంపీ సీట్లును గెల్చుకుంది. దీదీని ఢీకొట్టాలని చూసిన బీజేపీ గతంలో గెలిచిన సీట్లను కూడా లాస్ చేసుకుని ఈ సారి 12 సీట్లకే పరిమితమైంది.

Advertisement

Next Story