cm biswa sharma: జార్ఖండ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం.. అసోం సీఎం బిస్వశర్మ

by vinod kumar |
cm biswa sharma: జార్ఖండ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం.. అసోం సీఎం బిస్వశర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ ప్రభుత్వంపై అసోం సీఎం హిమంత బిస్వశర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందని తెలిపారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల టైంలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు సోరెన్ రాజకీయాల నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇటీవల రాంచీలో జరిగిన బీజేవైఎం ర్యాలీ అనంతరం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బీజేపీ నాయకులతో సహా 12,000 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై బిస్వ శర్మ స్పందించారు. స్వతంత్ర భారతదేశంలో ఈ దారుణం కనీ వినీ ఎరుగనిదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేమని, డీజీపీని ఆ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానన్నారు. యువకులపై ఎఫ్‌ఐఆర్‌లు కార్మికులను బ్లాక్‌మెయిల్ చేయడానికేనన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. కాగా, ఈ ఏడాది జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed