- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
cm biswa sharma: అగ్ని వీర్‌లను అసోం పోలీసు శాఖలో చేర్చుకుంటాం..సీఎం హిమంత బిస్వ శర్మ
దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలోని అగ్నివీర్‌లను పోలీస్ శాఖలో చేర్చుకుంటామని అసోం సీఎం హిమంత బిస్వశర్మ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సైన్యాన్ని ఆధునీకరించడానికి ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌పై అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా భారత సైన్యాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం అగ్నిపథ్ పథకంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్షాలు, ఎన్డీఏ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిస్వశర్మ స్పందించారు. కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనిపైనే ప్రతిపక్షాల నాయకులు ఫైర్ అయ్యారు.