- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పౌర హక్కులపై దాడి జరుగుతోంది: శరద్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై దాడి జరుగుతోందని, ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్‌చంద్ర పవార్ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెహ్రూ, అంబేద్కర్‌లపై ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని విమర్శించారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాధమిక హక్కులను పొందు పర్చకపోతే పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో నెలకొన్ని పరిస్థితులే ఇక్కడ ఉండేవన్నారు. గత వారం పూణేలో జర్నలిస్టు నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని పవార్ ఖండించారు. మాట్లాడేవారిని అణచివేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనే నిజమైందని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది అభిషేక్ జెబరాజ్ ద్వారా పవార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రెండు వారాల్లో విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అజిత్ పవార్ వర్గం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేవియట్ దాఖలు చేసింది. కాగా, అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.