Snapchat Love: లవర్ కోసం పాక్‌కు వెళ్లిన చైనా యువతి..

by Vinod kumar |
Snapchat Love: లవర్ కోసం పాక్‌కు వెళ్లిన చైనా యువతి..
X

లాహోర్ : స్నాప్‌చాట్‌ యాప్ వేదికగా చిగురించిన ప్రేమ ఆమెను దేశ సరిహద్దు దాటించింది. 21 ఏళ్ల చైనా యువతి గావ్‌ ఫెంగ్‌ స్నాప్‌చాట్‌లో పరిచయమైన తన లవర్ కోసం పాకిస్తాన్ కు చేరుకుంది. ఆమె మూడు నెలల వీసాపై రోడ్డు మార్గం గుండా పాక్‌ లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బైజర్‌ టౌన్‌కు వెళ్లింది. లవర్ 18 ఏళ్ల జావెద్‌ వచ్చి గావ్‌ ఫెంగ్‌‌ను రిసీవ్ చేసుకున్నాడు.

బైజర్‌ టౌన్.. ట్రైబల్‌ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో ఉంటుంది. అందుకే భద్రతా కారణాల రీత్యా గావ్‌ ఫెంగ్‌ను ఆమె లవర్ జావెద్‌.. లోయర్ దిర్‌ జిల్లాలోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఇద్దరికీ మూడేళ్లుగా పరిచయం ఉందని పాక్‌ పోలీసులు తెలిపారు. చైనా యువతికి కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు. ఆమె ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నట్లు గుర్తించామన్నారు. గావ్‌ ఫెంగ్‌ను.. జావేద్‌ ఇంకా నిఖా చేసుకోలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story