- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'యుద్ధం జరిగితే చైనా, పాక్ కలిసి వస్తాయి.. సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రిపేర్'
న్యూఢిల్లీ: యుద్ధమంటూ జరిగితే చైనా, పాకిస్తాన్ కలిసే వస్తాయని అప్పుడు దేశానికి నష్టం తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన మాజీ సైనికులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన యూట్యూబ్ చానల్‌లో ఆదివారం అప్లోడ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ''యుద్ధం జరిగితే చైనా, పాకిస్తాన్ కలిసి వస్తాయి. కాబట్టి, భారత్‌కు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రెండు దేశాల నుంచి భారత్ అధిక ముప్పును ఎదుర్కొంటోంది. మీరంటే (సైనికులనుద్దేశించి) నాకు గౌరవం కాదు.. మీపై ప్రేమ, అభిమానం ఉన్నాయి. మీరు ఈ దేశాన్ని కాపాడుతున్నారు. మీరు లేకుండా ఈ దేశమే లేదు' అని అన్నారు. అలాగే, 'ఒకప్పుడు మనకు ఇద్దరు శత్రువులు ఉండేవారు. అవి చైనా, పాకిస్తాన్. వాటిని వేర్వేరుగా ఉంచడమే మన పాలసీగా ఉండేది.
కానీ, ఇప్పుడు అవి ఒక్కటయ్యాయి. సైనిక పరంగానే కాకుండా, ఆర్థికంగానూ ఏకమయ్యాయి. ఈ సమయంలో యుద్ధం జరిగితే ఏకకాలంలో రెండు దేశాలతో చేయాల్సి ఉంటుంది. అది దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది' అని చెప్పారు. కేంద్రం తీరుపై ఆయన స్పందిస్తూ, '2014 తర్వాత మన ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ఇప్పుడు మన దేశంలో అలజడి, కొట్లాటలు, గందరగోళం, ద్వేషం ఉన్నాయి. ఇదే సమయంలో చైనా, పాక్‌లు కలిసి మనకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. అందుకే, ఈ విషయంలో ప్రభుత్వం నిశ్శబ్ధంగా ఉండకూడదని నేను పదే పదే చెబుతున్నాను. సరిహద్దులో ఏం జరిగిందో ప్రభుత్వమే దేశ ప్రజలకు చెప్పాలి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తక్షణమే ఆలోచించాలి. త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే పెద్ద నష్టం తప్పదు. అరుణాచల్, లడఖ్ సరిహద్దుల్లో ఏం జరుగుతోందనే దానిపై చాలా ఆందోళన చెందుతున్నాను' అని అన్నారు.
Also Read...
- Tags
- rahul gandhi