- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
by samatah |
X
దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వ హయాంలో చైనా అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలోని లఖింపూర్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. చైనా దురాక్రమణ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ అసోంకు బై బై చెప్పిన తీరును, 1962 సంవత్సరాన్ని అరుణాచల్, అసోం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో దేశ సరిహద్దును సురక్షితం చేసి చొరబాట్లను నిలిపివేసిందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో తూర్పు లడఖ్‌లో చైనాతో నెలల తరబడి సాగుతున్న సైనిక ప్రతిష్టంభనలో భారత్ ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోలేదని వెల్లడించారు. గత పదేళ్లలో శాంతి ఒప్పందాలు చేశామని, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. రాబోయే రోజుల్లో అసోం మరింత అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story