- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనా వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయి: జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పదేపదే అంటున్న చైనా వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు. ఈ సమస్య కొత్తది కాదు, చైనా ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ తమదే అని వాదనలు చేస్తుంది. దీనిలో ఎంతమాత్రం నిజం లేదు. ఈ రాష్ట్రం ముమ్మాటికి భారత్‌లో సహజభాగం, ఈ విషయంలో మేము చాలా స్పష్టంగా, స్థిరంగా ఉన్నామని అన్నారు.
ఇటీవల చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పేర్కొన్న తరుణంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా చేసిన ఈ వ్యాఖ్యలపై కొద్దిరోజుల క్రితం భారత విదేశీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్రం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగా ఉంటుందని, అక్కడి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ప్రయోజనం లభిస్తుందని తెలపగా, తాజాగా మంత్రి జైశంకర్ చైనా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.