చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏదో తెలుసా..

by Disha News Desk |
చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏదో తెలుసా..
X

న్యూఢిల్లీ: ప్రతి ఏడాదీ 'చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ధ ఇయర్'‌ ను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్(ఓయూపీ) విభాగం ప్రచురిస్తూ వస్తుంది. దీని కోసం రాజకీయాలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల మొదలు పుస్తకాలు, చలనచిత్రాలు, సంగీతం, సాంకేతికత, వారికి ఇష్టమైన క్రీడలు, ప్రముఖుల వరకు పలు అంశాలపై పిల్లలపై సర్వే నిర్వహించి వారి భాషా పరిజ్ఞానం పై ఓ నివేదికను ప్రచురిస్తోంది. కాగా ఈ ఏడాది 'యాంగ్జైటీ' అనే పదాన్ని 'చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ధ ఇయర్' గా ఓయూపీ ప్రకటించింది. యూకేలోని 85 పాఠశాలల్లోని 7-14 ఏండ్ల పిల్లల వయస్సు గల 8000 మంది పిల్లలపై సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు తరుచుగా ఏ పదాలను ఎక్కువగా ఉపయోగిస్తారో ఎంచుకోవాలని పిల్లలను నిర్వహకులు అడిగారు.

అందులో 1/5వ వంతు(21%) విద్యార్థులు 'యాంగ్జైటీ' అనే పదాన్ని తమ ప్రథమ ప్రాధాన్యత ఎంచుకున్నారు. లాక్ డౌన్, పాఠశాలల మూసివేత వంటి కారణాలు వారిపై చూపించిన ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిర్వహకులు అభిప్రాయ పడ్డారు. వారి రెండో ప్రాధాన్యతగా( 'చాలెంజింగ్' 19%, తర్వాతి స్థానంలో ఐసోలేట్ (14%), శ్రేయస్సు (13%)లు ఉన్నాయి. కాగా గతంలో చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ కరోనా వైరస్ (2020), బ్రెగ్జిట్ (2019), ప్లాస్టిక్ (2018), ట్రంప్ (2017), రెఫ్యూజీ (2016)లు ఉన్నాయి.

Advertisement

Next Story