ఫోన్ చూడనివ్వడం లేదని తల్లితండ్రులపై కేసు పెట్టిన పిల్లలు

by M.Rajitha |
ఫోన్ చూడనివ్వడం లేదని తల్లితండ్రులపై కేసు పెట్టిన పిల్లలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమ తల్లిదండ్రులు ఫోన్, టీవీ చూడనివ్వడం లేదంటూ పిల్లలు వారిపై పోలీస్ కేసు పెట్టిన వింత ఘటన ఇండోర్ లో జరిగింది. 21 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల తన తమ్ముడితో కలిసి ఇండోర్ లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో "మా అమ్మానాన్న ఫోన్, టీవీ చూడటంపై ఆంక్షలు విధిస్తున్నారని, తమని కొడుతున్నారని వారిపై కేసు నమోదు చేయండి" అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడే క్రమంలో పోలీస్ స్టేషన్లోనే ఆ పిల్లలను మరోసారి తిట్టడం, కొట్టడంతో పోలీసులు ఆ తల్లిదండ్రుల మీద జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 2021 లో జరిగిన ఈ ఘటన జరగగా జిల్లా కోర్టు విచారణలో నేర నిరూపణ జరిగి కోర్టు శిక్షార్హులుగా తీర్పునివ్వడంతో... దానిని సవాల్ చేస్తూ ఆ తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్ళగా, ఈరోజు కోర్టు మధ్యంతర స్టే విధించింది. అయితే ఈ కేసులో హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థిస్తే ఆ తల్లిదండ్రులకు 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Next Story

Most Viewed