- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంతృప్తితోనే బీజేపీపై విమర్శలు.. ఉద్ధవ్ ఠాక్రేకు ఫడ్నవీస్ చురకలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. స్థానిక సంస్థల్లో నాలుగో స్థానంలో నిలిచారనే అసంతృప్తితోనే విమర్శలు చేస్తున్నారని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ ముంబై పాలక సంస్థల ఎన్నికల పోటీ చేసిన సమయంలో శివసేన పార్టీయే లేదని ఆరోపించారు. 'రామజన్మభూమి ఉద్యమం సమయంలో మీరంతా ఎక్కడున్నారు. మేము బుల్లెట్లను స్వీకరించాం. లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ రోజు ప్రధాని మోడీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది' అని అన్నారు. 1984లో శివసేన పార్టీ అభ్యర్థి బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేశారని ఎద్దేవా చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు ఆయన అసంతృప్తిని చూపిస్తున్నాయని అన్నారు. అంతకుముందు రోజు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుని 25 ఏళ్ల సమయం వృథా చేశామని వ్యాఖ్యానించారు. అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వ కార్డును వాడుకోలేదన్నారు. అధికారం కోసం బీజేపీ హిందుత్వ అవకాశవాదిగా మారిందని మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేసి గెలవాలని అమిత్ షా చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు.