Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. పిడుగుపాటుకు ఏడుగురు మృతి

by vinod kumar |
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. పిడుగుపాటుకు ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్-భటపరా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం మోహతారా గ్రామంలో పలువురు పొలంలో పని చేస్తు్న్నారు. ఈ క్రమంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా సమీపంలోని చెరువు గట్టున ఒకే దగ్గర కూర్చున్నారు. దీంతో ఒక్కసారిగా వారి పక్కనే పిడుగుపడింది. ఈ నేపథ్యంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను ముఖేష్ (20), టంకర్ సాహు (30), సంతోష్ సాహు (40), థానేశ్వర్ సాహు (18), పోఖ్‌రాజ్ విశ్వకర్మ (38), దేవ్ దాస్ (22), విజయ్ సాహు (23)గా గుర్తించారు. అంతకుముందు ఈనెల 6న దంతెవాడలోని పారామిలటరీ దళానికి చెందిన యాంటీ నక్సలైట్ శిక్షణా కేంద్రం వద్ద పిడుగుపడగా ఇద్దరు సీఆర్ పీఎఫ్ సిబ్బంది మరణించారు. జిల్లాలోని బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫెసిలిటీలో శిక్షణ సెషన్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story