- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chennai Techie Dies By Suicide: చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. పని ఒత్తిడి కారణమని అనుమానం
దిశ, నేషనల్ బ్యూరో: ఈవై ఉద్యోగిని మృతి ఘటన మరువకముందే.. మరో టెకీ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కార్తికేయ టెకీగా పని చేస్తున్నారు. కాగా.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు. కార్తికేయ ఇంట్లో కరెంటు తీగకు చుట్టునిఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య తెలిపింది. ఈ ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.
కరెంట్ తీగకు చుట్టుకుని
సోమవారం కార్తికేయ భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పని ఒత్తిడితోనే కార్తికేయ చనిపోయాడు అన్న వి షయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.