- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నీ వల్లే నా ప్రియురాలు దూరం అయింది’ డాక్టర్ పై యువతి మాజీ బాయ్ ఫ్రెండ్ కాల్పులు
దిశ, డైనమిక్ బ్యూరో:కొత్త స్నేహితుడి వల్లే తనను తన ప్రియురాలు దూరం పెట్టిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తుపాకితో ఓ డాక్టర్ పై కాల్పులకు తెగబట్టాడు. సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్రాస్ మెడికల్ కాలేజీలో వేలూరు కు చెందిన రోహన్ అనే యువకుడు పీజీ చదువుతున్నాడు. రోహన్ చదువుతున్న కాలేజీలోనే యూపీకి చెందిన అమిత్ కుమార్ లవర్ కూడా చదువుతోంది. అయితే గత కొంత కాలంగా అమిత్ కు తన లవర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ యువతి అమిత్ తో మాట్లాడటం మానేసింది. తన ప్రియురాలు తనకు దూరం కావడానికి ఆమెతో రోహన్ చనువుగా ఉండటమే కారణం అని అనుమానం పెట్టుకున్న అమిత్ కుమార్.. రోహన్ పై కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ రితిక్ తో కలిసి రూ.500 కు యూపీలో ఓ తుపాకీ కొనుగోలు చేసి చెన్నైకి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఒంటరిగా ఉన్నప్పుడు రోహన్ ను అంతం చేసేందుకు రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. చివరకు నిన్న సాయంత్రం కాలేజీ సమీపంలో ఉన్న ఓ స్టాల్ వద్ద రోహణ్ టీ తాగుతుండగా అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రోహన్ తృటిలో తప్పించుకోగలిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేయగా వారిలో రితిక్ పట్టుబడగా అమిత్ పారిపోయాడు. విజయవాడలో అమిత్ పట్టుబడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.