- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. కేదార్‌నాథ్‌లో సన్నాహాలు స్టార్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ‘చార్ ధామ్ యాత్ర’ ఒకటి, ఈ యాత్రలో హిందువులు నాలుగు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే, ఈ ఏడాది 2024 లో రేపటి (శుక్రవారం) నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తారు. ఇది పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రగా భక్తులు నమ్ముతారు. మహా శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం రేపు తెరుచుకోనుంది. పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ తలుపులు తెరవనున్నట్లు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా 40 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర మే 10 న ప్రారంభమవుతుంది.
యమునోత్రి గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలలో మూడు తెరవబడుతున్నవి. శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవబోతున్నందున, పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులను స్వాగతించారు. చార్‌ధామ్ యాత్ర-2024లో కేదార్‌నాథ్ ధామ్‌లోని భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.