FASTAG: వాహనదారులకు అలెర్ట్.. నేటి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పు

by Mahesh |
FASTAG: వాహనదారులకు అలెర్ట్.. నేటి నుంచి ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ నిబంధనల్లో మార్పు జరిగింది. కాగా మార్చిన ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు సంవత్సరాలు దాటిన వారు కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలి. అలాగే మూడు సంవత్సరాలు దాటిన వారు కేవైసీ చేయించుకోవాలి. దీంతో పాటుగా ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లో వాహన నెంబర్ ను ఫాస్ట్ ట్యాగ్ డేటా బేస్ లో నమోదు చేయించుకోవాలి. వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ కొత్త రూల్స్ కు రవాణా శాఖ అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఒక వేళ ఎవరైనా తమ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే.. చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే టోల్ గేట్ వద్ద వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో వాహనదారులు ముందస్తుగా అలర్ట్ గా ఉండి పైన తెలిపిన సూచనలు పాటించాలి.

Advertisement

Next Story