- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమిషాల్లోనే పని స్టార్ట్ చేసిన చంద్రయాన్-3.. అద్భుతమైన జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్ (ఫొటోలు)
దిశ, వెబ్‌డెస్క్: చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్‌గా సేఫ్ ల్యాండ్ అయ్యింది. 20 నిమిషాల తీవ్ర ఉత్కంఠ నడుమ విజయవంతంగా చంద్రుడిపై చంద్రయాన్-3 దిగడంతో.. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ అప్పుడే తన పనిని మొదలుపెట్టింది. బెంగళూర్‌లోని స్పేస్ రిసెర్చ్ సెంటర్‌తో కనెక్ట్ అయిన చంద్రయాన్-3.. జాబిల్లిపై దిగిన తర్వాత తొలి చిత్రాన్ని పంపించిందని ఇస్రో ట్వీట్ చేసింది. ల్యాండర్ పంపిన నాలుగు చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. ఇక, చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది.
యావత్ దేశ ప్రజలు చంద్రయాన్-3 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. అంతరిక్ష రంగంలోనే అరుదైన ఘనత సాధించిన భారత్, ఇస్రోకు ప్రపంచ దేశాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా, జూలై 14వ తేదీన ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపి 140 కోట్లమంది దేశ ప్రజలు గర్వపడేలా చేసింది.
Read More..
చంద్రయాన్-3 సక్సెస్.. సిగ్గు పడుతున్న అంటూ సొంత దేశంపై విమర్శలు గుప్పించిన నటి
చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు
చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్.. ఆ ఇద్దరికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పెషల్ విషెస్
- Tags
- Chandrayaan-3