- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద ఖైదీలకు ఆర్థిక సాయం.. పెనాల్టీ, బెయిల్ అమౌంట్ కట్టలేనివారికి లబ్ధి
by Harish |
X
న్యూఢిల్లీ: పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పెనాల్టీలు, బెయిల్ అమౌంట్ కట్టలేని ఖైదీలకు లబ్ధి చేకూరేలా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రక్రియను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిష్కారాల ద్వారా పేద ఖైదీలు ప్రయోజనం పొందేలా చూస్తామని వెల్లడించింది. దానికి తగినట్లు ఈ-ప్రీజన్స్ వేదికను పునరుద్ధరించడం తో పాటు జిల్లా న్యాయసేవల వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపింది. సమయానికి తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమైన మార్గదర్శకాలను పంపిస్తామని పేర్కొంది.
Advertisement
Next Story