- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hospitals Security :కేంద్ర ఆస్పత్రులకు 25 శాతం భద్రత పెంపు
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యసంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద భద్రతను 25 శాతం మేర పెంచుతామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇంకా ఏవైనా ప్రభుత్వ ఆస్పత్రులకు భద్రత అవసరమైతే తమను సంప్రదించాలని, పరిస్థితిని బట్టి ఆయా ఆస్పత్రుల వద్ద కూడా తప్పకుండా మార్షల్స్‌ను మోహరిస్తామని వెల్లడించింది.
వైద్యులు, ఆస్పత్రులపై దాడులను నిరోధించడానికి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లును వెంటనే చట్టరూపంలోకి తేవాలని వైద్యసంఘాలు కోరడాన్ని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తప్పుపట్టాయి. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ దుర్ఘటన రోగులు, వైద్యుల మధ్య జరిగింది కాదని.. దానికి ముసాయిదా బిల్లుతో లంకె పెట్టడం సరికాదని వైద్య సంఘాలకు సూచించాయి. ఇప్పటికే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యులు, ఆస్పత్రుల భద్రతకు కఠిన చట్టాల్లో అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.