అదానీ అంశంపై నిపుణలు కమిటీకి కేంద్రం ఓకే

by Javid Pasha |   ( Updated:2023-02-13 12:58:25.0  )
అదానీ అంశంపై నిపుణలు కమిటీకి కేంద్రం ఓకే
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఓకే చెప్పింది. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఇన్వెస్టర్ల భద్రతను నిర్ధారించేందుకు కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కమిటీ కోసం సీల్డ్ కవర్ లో నిపుణుల పేర్లను సూచించాలని సుప్రీంను కోరారు. అదానీ అంశాన్ని సెబీ చూసుకుంటోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కాగా స్టాక్ మానిప్యులేషన్‌‌‌‌, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్‌‌‌‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గత శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రెగ్యులేటరీ మెకానిజంను బలోపేతం చేయడం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో ఇవాళ విచారణ సందర్భంగా కమిటీ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed