- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు కేంద్రం షాక్.. ఇక నుంచి అది తప్పనిసరి
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులకు కేంద్రం ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్‌లో భాగంగా ఎంవీ యాక్ట్‌లో పలు మార్పులు చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్) నుంచి మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలని తెలిపింది. అందులో భాగంగా 8 ఏళ్ల పాటు నడిచిన పాత వాహనాలకు రెండేళ్ల పాటు, అంతకు మించిన పాత వాహనాలకు ఏడాది పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను ఏటీఎస్ నుంచి పొందాల్సి ఉంటుంది. అయితే,హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి, మీడియం గూడ్స్ వెహికల్స్/మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ (రవాణా) కోసం జూన్ 1, 2024 నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి చేయనున్నట్లు నోటిఫికేన్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ పై ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, సూచనలు ఇవ్వాల్సి ఉంటే 30 రోజుల్లో చెప్పాలని, తదుపరి తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వెల్లడించింది.