- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మొట్టమొదట నటిగా ప్రయాణం మొదలు పెట్టారు. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చారు. యూపీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ పై గట్టి విమర్శలు చేస్తుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా, స్మృతి ఇరాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. అందులో భాగంగానే ఓ నెటిజన్ మీ ఫ్రెండ్ మోనా భర్తను మీరు పెళ్లి చేసుకున్నారా? అని ప్రశ్నించాడు. దానికి స్మృతి ఇరాని స్పందిస్తూ.. ‘‘ మోనా నా కంటే 13 ఏళ్ల పెద్దది, కాబట్టి, ఆమె నా చిన్ననాటి ఫ్రెండ్ అయ్యే అవకాశమే లేదు. మోనా రాజకీయ నాయకురాలు కాదు, కాబట్టి ఆమెను ఇందులోకి లాగవద్దు. అవసరమైతే నాతో పోరాడాలి, నాతో వాదించాలి. నన్ను కించపరిచినా సరే గానీ, రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఆమెను ఇందులోకి లాగవద్దు. ఆమెను గౌరవించండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా, ఆమె కేంద్ర మంత్రి భర్త పేరు జుబిన్ ఇరానీ. వీరిద్దరు 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. జుబిన్ స్మృతి కంటే ముందే మోనాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉందని సమాచారం.
Read More: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ 'OG' అప్డేట్