రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. పెంచిన ధరల వివరాలివే!

by Gantepaka Srikanth |
రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. పెంచిన ధరల వివరాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: రబీ సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతుల(farmers)కు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(Central government) శుభవార్త చెప్పింది. 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఆరు పంటలకు MSPని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమల ధరను రూ.2275 నుంచి రూ.2425కు, బార్లీ ధరను రూ.1850 నుంచి రూ.1980కు, పప్పు ధర రూ.6425 నుంచి రూ.6700, ఆవాలు రూ.5650 నుంచి రూ.5950, శనగలు రూ. 5440 నుంచి రూ.5650, కుసుమలు రూ.5800 నుంచి రూ.5940కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు. తాజా పెంపుతో ఇప్పటివరకు ఉన్న 50శాతం డీఏ 53 శాతానికి చేరనుంది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Advertisement

Next Story