- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ గా డీఏ పెంపు
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ.. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల డీఏ 50 నుంచి 53 శాతానికి పెరిగింది. గతేడాది కూడా కేంద్రం పండుగ సమయంలోనే ఉద్యోగుల డీఏ ను 4 శాతం పెంచింది. ఈ నిర్ణయంతో రూ.18000 బేసిక్ జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం.. ఈ ఏడాది జూలై 1 నుంచి రూ.540 మేర పెరగనుంది. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ లబ్ధిని పొందనున్నారు.
ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఏడాదికి రెండుసార్లు పెంచుతారు. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కేంద్రం వీటిని పెంచుతుంది. ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచింది. దాంతో డీఏ 50 శాతానికి పెరిగింది. డీఆర్ ను కూడా 4 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు కూడా మద్దతు ధర పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలు, కెనడా - భారత్ మధ్య సంబంధాలపై కూడా కేబినెట్ లో చర్చించినట్లు తెలుస్తోంది.