గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

by GSrikanth |   ( Updated:2024-03-16 06:26:44.0  )
గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్జిత్ సింగ్ పూరి సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా వెల్లడించారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 2 శాతం వ్యాట్ తగ్గించింది. దేశ వ్యాప్తంగా తగ్గిన రేపు(శుక్రవారం మార్చి 15) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed