- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాంపుల చరిత్రపై రీల్స్ చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: తపాలా శాఖ ఆధ్వర్యంలో త్వరలో స్టాంపుల ద్వారా భారతీయ చరిత్ర, కథలు, సంప్రదాయాల గురించి నేటి తరం యువతకు, పిల్లలకు డిజిటల్‌గా పరిచయం చేయడానికి రీల్స్(షార్ట్ వీడియోలు) అందుబాటులో ఉంటాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్, అమృత్‌పెక్స్ 2023 ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన ఆయన, భారతీయ స్టాంపుల ద్వారా చరిత్ర గురించి 25-30 సెకన్లతో కూడిన రీల్స్ ప్రతి ఆదివారం లేదా సోమవారం అందుబాటులో ఉంటాయని, 20 రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
భారతీయ చరిత్ర, కథలను పిల్లలకు, యువతకు, వివిధ వయసుల వారికి తెలియజేయడానికి స్టాంపుల ద్వారా, డిజిటల్‌గా ప్రచారం చేయనున్నారు. అలాగే, 'డిజిటల్ ఫిలాటెలీ' అనేది కళ్లను కట్టిపడేసే వర్చువల్ ఎగ్జిబిషన్' అని దీని ద్వారా దాని కంటెంట్, డిజైన్, సాంకేతికతతో ప్రజలు ప్రాచీన భారతదేశం, అద్భుతమైన సంప్రదాయం గురించి తెలుసుకుంటారని మంత్రి అన్నారు.
'అమృత్‌పెక్స్-2023' అనేది 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్. దీనిలో లక్ష స్టాంపులను ప్రదర్శిస్తారు. డిజిటల్ ఎగ్జిబిట్‌లు స్టాంపులు, ఫొటోగ్రాఫిక్ సేకరణల ద్వారా ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు, వారసత్వాన్ని ప్రజలకు చూపిస్తారు.