ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. సబ్సిడీ తేదీని పెంచిన కేంద్రం

by Mahesh |   ( Updated:2024-09-11 15:57:33.0  )
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. సబ్సిడీ తేదీని పెంచిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రజల్లో ఎలక్ట్రానిక్ వాహానాల వాడకంపై ఆసక్తి పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ కూడా ఇస్తుంది. కాగా ఈ ఎలక్ట్రానికి వాహనాల సబ్సిడీ చివరి గడువు జూలై 30వ తేదీతో ముగియనుంది. కాగా ఈ గడువు తేదీని సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎలక్ట్రానిక్ టూవీలర్లపై రూ. 10 వేల వరకు సబ్సిడీ వస్తుంది. అలాగే చిన్న తరహా త్రీ వీలర్ వాహనాలపై రూ. 25 వేల వరకు, లార్జ్ త్రీ వీలర్ వాహానాలపై రూ. 50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed