కొత్త ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేదీ..ప్రకటించిన కేంద్రం

by vinod kumar |   ( Updated:2024-06-11 18:38:23.0  )
కొత్త ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేదీ..ప్రకటించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమించింది. జూన్ 30న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ద్వివేది ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెలాకరులో పదవీ విరమణ చేయనుండగా..అనంతరం ద్వివేదీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, 1964 జూలై 1న జన్మించిన ద్విదేదీ 1984 డిసెంబర్15న భారత సైన్యంలో నియమించబడ్డారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలు అందించారు. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా నియమితుడయ్యే ముందు 2022-24 వరకు డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహించారు. మే నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సిన జనరల్ పాండేకు గతంలో ఒక నెల సర్వీస్ పొడిగించారు.

Advertisement

Next Story

Most Viewed