- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBSE:12వ తరగతి బోర్డు పరీక్షలపై కేంద్రం ఆప్షన్!.. ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు?
దిశ, డైనమిక్ బ్యూరో: 12వ తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రవిద్యాశాఖ రంగం సిద్దం చేస్తోంది. సీబీఎస్ఈ బోర్డు పరిథిలోని 10, 12 వతరగతి పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు కొద్ది రోజులుగా కేంద్ర విద్యాశాఖ తీవ్ర కరత్తులు చేస్తోంది. అయితే దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 12వతరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి- మార్చిలో ఒకసారి నిర్వహించగా.. జూన్ లో రెండో సారి నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఇది అమలైతే.. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఏడాదికి రెండు పరీక్షల విధానం తీసుకోని రావాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లతో సీబీఎస్ఈ సంప్రదింపులు జరిపగా.. ఇందులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎప్పటిలాగే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత విధానం ప్రకారం 12 తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి- మార్చిలో బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. మే నెలలో ఫలితాలు విడుదల అయ్యాక ఫెయిల్ అయిన వారికి యదావిధిగా సప్లిమెంటరీ పరీక్షలు ఉంటుండగా.. పాస్ అయిన వారు ఏదో ఒక సబ్జెక్ట్ లో మాత్రమే మార్కులు పెంచుకునేందుకు అవకాశం ఉంది. కానీ కొత్త విధానం ప్రకారం మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్ధులు జూన్ లో మరోసారి అన్ని పరీక్షుల రాసేందుకు వీలు కల్పిస్తారు. ఇది పూర్తిగా విద్యార్ధుల నిర్ణయం మేరకే తప్పనిసరి కాదని జాతీయ మీడియా వర్గాల సమాచారం. అలాగే జేఈఈ మాదిరిగా ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం కూడా కల్పించనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.