- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిసోడియాకు మార్చి 17 వరకు ఈడీ కస్టడీ!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై సిసోడియాను మరింత విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇందుకుగాను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. గత మూడు రోజులుగా తిహార్ జైలులో సిసోడియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు గత రాత్రి అరెస్ట్ చేశారు.
శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇండోస్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్స్‌ని ఇప్పించడంలో సిసోడియాది కీలక పాత్ర ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు సిసోడియాను మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి పంపింది. మరో వైపు సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారించేందుకు సమయం లేకపోవడంతో విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.