Caste census: ఎన్నికల్లో లబ్ది కోసం కులగణనను వాడొద్దు.. ఆర్ఎస్ఎస్

by vinod kumar |   ( Updated:2024-09-02 10:39:30.0  )
Caste census: ఎన్నికల్లో లబ్ది కోసం కులగణనను వాడొద్దు.. ఆర్ఎస్ఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కులగణన అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సునీల్ అంబేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకోవద్దని తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని చెప్పారు. సంక్షేమ అవసరాలను పరిష్కరించడానికి మాత్రమే కులగణన ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. కేరళలోని పాలక్కాడ్‌లో నిర్వహించిన మూడు రోజుల ఆర్ఎస్ఎస్ సమావేశాల అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏయే సామాజిక వర్గం వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే కులగణన చేపట్టాలన్నారు. ఇది జాతీయ సమైఖ్యతకు ఎంతో అవసరమని చెప్పారు.

ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ అంశంపై కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం స్పష్టం చేశారు.‘ఇటీవల, కుల గణన గురించి దేశ వ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. కుల గణన సమాజ ప్రగతికి ఉపయోగపడాలని ఆర్ఎస్ఎస్ కోరుకుటుంది. కానీ దీని వల్ల సామాజిక సామరస్యం, జాతీయ సమగ్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ‘ఆర్‌ఎస్‌ఎస్ కుల గణనను బహిరంగంగా వ్యతిరేకించింది. కులగణనపై వారి వైఖరి స్పష్టంగా తెలసింది. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హక్కులు ఇవ్వాలనుకోవడం లేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story