రూ.5.60కోట్ల నగదు, 3కిలోల బంగారం..కర్ణాటకలో పట్టివేత

by samatah |
రూ.5.60కోట్ల నగదు, 3కిలోల బంగారం..కర్ణాటకలో పట్టివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. బళ్లారి పట్టణం కంబళి బజార్‌లోని హేమ జ్యువెలర్స్ యజమాని ఇంటిపై దాడి చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు ఉన్నాయి. అనంతరం హేమ జ్యువెలర్స్ యజమాని నరేష్ సోనీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు హవాలా లావాదేవీకి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన మొత్తం వస్తువుల విలువ సుమారు రూ.7.60కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నట్టు వెల్లడించారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా తదుపరి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తామని తెలిపారు. కాగా, ఎన్నికల వేళ ఇంత భారీగా డబ్బు, నగదు పట్టుబడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed