- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్షన్ స్టార్ట్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు మూడు నెలల పాటు ఇది అమల్లో ఉండనుంది. ఈ సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు కాకతప్పదు. తాజాగా తమిళనాడులో బర్త్ డే పార్టీ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. మైలాడుదురై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో బ్యాక్ డోర్ నుంచి తన కార్యాలయంలోకి ప్రవేచించి కార్యకర్తలతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
అంతేకాదు.. మద్యంతో విందు ఆరగించారు. ఈ విషయం ఆదివారం ఉదయం గుర్తించిన పట్టమంగళం వీఏఓ మైలాడుదురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంతో విందు చేసుకుంది నిజమేనని నిర్ధారణకు వచ్చి మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ కేసు నమోదు చేశారు.