Kumbh Mela Trains : కుంభమేళ ప్రత్యేక రైళ్ల రద్దు అవాస్తం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-29 05:21:25.0  )
Kumbh Mela Trains : కుంభమేళ ప్రత్యేక రైళ్ల రద్దు అవాస్తం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళ(Prayagraj Mahakumbh Mela)తొక్కిసలాట (Stampede)నేపథ్యంలో రైల్వే శాఖ మహాకుంభ మేళ ప్రత్యేక రైళ్లను రద్దు(Cancellation of special trains)చేసినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవం(News is False)అని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ(Union Railway Ministry)స్పష్టం చేసింది. ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళకు మౌని అమవాస్య పురస్కరించుకుని ఈ ఒక్క రోజునే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 360ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేసిందని తెలిపింది. కుంభమేళ తొక్కిసలాట నేపథ్యంలో రైళ్ల రద్దు చేశారన్న వార్తలు అవాస్తమని, ప్రకటించిన మేరకు వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొంది.

బుధవారం మౌని అమావాస్య సందర్భంగా శాహీ స్నానం ఆచరించేందుకు ప్రయాగ్ రాజ్ కుంభమేళలో త్రివేణి సంగమ స్థలి చేరుకున్న దాదాపు 10కోట్ల మంది భక్తులతో ఘాట్ లు నిండిపోయాయి. అయితే మౌని అమవాస్య ఘడియలు ప్రారంభంకాగానే భక్తులంగా ఒక్కసారిగా ఘాట్ లలోకి దూసుకెళ్లడంతో ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో తొక్కిసలాట నెలకొని పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. పరిస్థితి గురించి ఆరా తీసి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ప్రధాని మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు తొక్కిసలాట నేపథ్యంలో అఖాడా పరిషత్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పరిషత్ అధ్యక్షుడు రవింద్ర పూరి వెల్లడించారు. తొక్కిసలాగ సంఘటన బాధాకరమని. వేలాది మంది భక్తుల, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రోజు అమృత స్నానాలు రద్ధు చేసుకున్నామని వెల్లడించారు. ప్రజలంతా ఈ రోజు కాకుండా వసంత పంచమి రోజు స్నానానికి రావాలని సూచించారు.

మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో రెండో శాహీ స్నానం నిర్వహిస్తారు. తొక్కిసలాట కారణంగా అది రద్దయింది. ఇక, ఇతర ముఖ్యమైన స్నాన తేదీలు ఫిబ్రవరి 3 (వసంత పంచమి- మూడో శాహీ స్నానం), ఫిబ్రవరి 12 (మాఘీ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) మిగిలి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed