Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్

by Shamantha N |
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లా (Arsh Dalla)కు కెనడా (Canada)లోని కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. భారత్ ఉగ్రవాదిగా(Khalistani terrorist) ప్రకటించిన అర్ష్ దల్లాను.. అక్టోబర్ 28న కెనడాలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి కేసులో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జామీను మొత్తాన్ని అందజేసిన తర్వాత దల్లాకు బెయిల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అతడిని తమకు అప్పగించాలని ఇటీవల ట్రూడో సర్కార్ ను (Canada)ను భారత్‌ కోరింది. ఈ పరిణామాల మధ్య అర్ష్‌ దల్లాకు అక్కడి కోర్టు బెయిల్‌ ఇవ్వడం గమనార్హం.

అర్ష్ దల్లాపై కేసు

ఇక, భారత్ లో అర్ష్ దల్లాపై ఉన్న కేసుల్లో దల్లాను ప్రశ్నంచడానికి భారత అధికారులకు కోర్టు అవకాశం ఇవ్వలేదని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై కెనడా అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని భారత అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై భారత్‌లో హత్య, వేధింపులు, అపహరణ సహా పలు కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌లో అతడి పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా తెలిపింది. దల్లాకు సంబంధించిన పలు కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఖలీస్థానీ ఉగ్రవాది, గుర్తు తెలియని వారి కాల్పుల్లో హతమైన నిజ్జర్‌ (Hardeep Singh Nijjar)కు దల్లా సన్నిహితుడు.

Advertisement

Next Story

Most Viewed