Canada MP: ఖలిస్థానీ తీవ్రవాద భావజాలం ఇంకా కొంతమందిలో ఉంది.. కెనడా ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Canada MP: ఖలిస్థానీ తీవ్రవాద భావజాలం ఇంకా కొంతమందిలో ఉంది.. కెనడా ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య ఖలిస్థానీ తీవ్రవాదులపై విమర్శలు గుప్పించారు. 1985లో ఎయిరిండియా ఫ్లైట్ 182 పై జరిగిన దాడిపై విచారణ జరపాలన్న డిమాండ్ ఖలిస్థానీ తీవ్రవాదుల కుట్ర సిద్ధాంతాలను ప్రోత్సహిస్తుందన్నారు. కెనడియన్ పార్లమెంటును ఉద్దేశించి ఆర్య మాట్లాడుతూ.. రెండుసార్లు చేపట్టిన విచారణలో ఎయిరిండియా 'కనిష్క' ఫ్లైట్‌పై దాడి చేసి 329 మందిని ఖలిస్థానీ తీవ్రవాదులే చంపినట్లు తేలిందన్నారు. "39 సంవత్సరాల క్రితం, కెనడా ఖలిస్థాన్ తీవ్రవాదులు అమర్చిన బాంబుతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 గాలిలోనే పేల్చివేశారు. ఈ ఉగ్రవాద దాడికి కారణమైన భావజాలం కెనడాలోని కొంతమంది వ్యక్తులలో ఇప్పటికీ ఉంది" అని ఎంపీ చెప్పారు. "రెండు కెనడియన్ పబ్లిక్ ఎంక్వైరీలలో ఖలిస్థాన్ తీవ్రవాదులే ఎయిరిండియాపై బాంబుదాడికి కారణమని తేలిందన్నారు. బాంబుదాడిపై దర్యాప్తు చేపట్టాలని కొత్తగా దాఖలైన పిటిషన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఖలిస్థాన్ తీవ్రవాదులు ప్రచారం చేస్తున్న కుట్ర సిద్ధాంతాలను ప్రోత్సహిస్తూ కొత్త విచారణ జరపాలని పార్లమెంటులో పిటిషన్ ఉందని మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే?

జూన్ 23, 1985న మాంట్రియల్ నుండి బొంబాయికి వెళ్తున్న ఎయిరిండియా ఫ్లైట్ 182 పై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 268 మంది కెనడియన్లు, 24 మంది భారతీయులతో సహా మొత్తం 329 మంది చనిపోయారు. "ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఇది పాత గాయాలను మళ్లీ తెరుస్తుంది. ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రచారం, మద్దతు పొందే ప్రయత్నం." అని ఎయిరిండియా ఫ్లైట్ పై జరిగిన దాడిలో మరణించిన మహిళ భర్త అన్నాడు. ఆ వ్యాఖ్యలను కెనడా ఎంపీ ఆర్య మీడియాకు తెలిపారు. ఇకపోతే, ఈ ఏడాది బాంబుదాడి జరిగి 39 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా టొరంటోలోని క్వీన్స్ పార్క్ వద్ద బాధితులకు కెనడియన్ జర్నలిస్ట్ చేసిన నివాళులను ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed