భారత్‌తో కలిసి పనిచేయడానికి కెనడా రెడీ.. మోడీకి శుభాకాంక్షలు: జస్టిన్ ట్రూడో

by Harish |
భారత్‌తో కలిసి పనిచేయడానికి కెనడా రెడీ.. మోడీకి శుభాకాంక్షలు: జస్టిన్ ట్రూడో
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా భారత్-కెనడా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా, మోడీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుండటంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం మోడీకి అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా కెనడా ప్రధాని వ్యాఖ్యానిస్తూ, 2024 ఎన్నికల్లో విజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు. కెనడా మానవ హక్కులు, వైవిధ్యం, చట్ట బద్ధమైన పాలనకు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

జూన్ 2023లో కెనడాలో జరిగిన సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ప్రధాని ఆరోపించగా అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కూడా కెనడా చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవని తిప్పికొట్టింది.

ఇదిలా ఉంటే మోడీ వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టనుండటంతో పలు దేశాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోడీకి కాల్ చేసి అభినందించిన విషయాన్ని ఎక్స్‌ వేదికగా మోడీ స్వయంగా తెలిపారు. తన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు నుండి తనకు కాల్ వచ్చిందని, తన మాటలకు, భారత ప్రజాస్వామ్యంపై తనకున్న ప్రశంసలకు నిజంగా విలువ ఇస్తున్నానని మోడీ అన్నారు. అలాగే, ఫ్రాన్స్, ఈజిప్టు, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా తదితర దేశాలకు చెందిన పలువురు నేతలు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed