Khalistani extremists: ‘కెనడాను ఖలిస్తానీలు కలుషితం చేస్తున్నారు’: భారత సంతతి ఎంపీ

by S Gopi |
Khalistani extremists: ‘కెనడాను ఖలిస్తానీలు కలుషితం చేస్తున్నారు’: భారత సంతతి ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తానీ తీవ్రవాదుల వల్ల కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. వారంతా స్థానిక చట్టాలు అందించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇటీవల వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో తనతో పాటు సన్నిహితులను భారత్‌కు వెళ్లిపోవాలని చేసిన వ్యాఖ్యలపై చంద్ర ఆర్య స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన, ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యలను వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలీస్తాని మద్దతుదారుల దాడిపై ఆయన మండిపడ్డారు. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు కెనడాకు వచ్చి దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారన్నారు. దక్షిణాసియాలోని ప్రతి దేశంతో పాటు కరేబియన్, ఆఫ్రికా దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన స్థిరపడ్డాం. కెనడా మా స్వస్థలం. ఇక్కడ మా సేవలు కొనసాగుతాయి. చరిత్ర కలిగిన భారత సంస్కృతి, వారసత్వం ద్వారా బహుళ సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని చంద్ర ఆర్య పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed