- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Lawyer : వివాదాస్పద లాయర్‌కు నాలుగు నెలల జైలుశిక్ష.. ఏం చేశాడంటే..
దిశ, నేషనల్ బ్యూరో: నిరాధార ఆరోపణలతో జడ్జీలు, పోలీసు అధికారులపై దాదాపు 30 నుంచి 40 ఫిర్యాదులు చేసిన ఓ వివాదాస్పద న్యాయవాది(Lawyer)కి ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) నాలుగు నెలల జైలుశిక్ష విధించింది. రూ.2వేల జరిమానా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ‘‘సదరు లాయర్‌కు కోర్టుపై గౌరవభావం లేదు. అందుకే జడ్జీలు (Judges), పోలీసు అధికారులను అవమానించేలా పిటిషన్‌లో పదాలు వాడాడు. నిరాధార ఆరోపణలు చేశాడు. నేరపూరిత ధిక్కారానికి పాల్పడి న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించాడు. అందుకే అతడిని శిక్షించక తప్పదు’’ అని ఈసందర్భంగా న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది.
‘‘చేసిన తప్పుకు ఆ లాయర్ కనీసం పశ్చాత్తాప పడటం లేదు. క్షమాపణ కోరడం లేదు. అలాంటప్పుడు మేం చర్యలు తీసుకోక తప్పదు’’ అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి సదరు వివాదాస్పద లాయర్‌పై ఈ ఏడాది మే నెలలోనే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సుమోటోగా క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచే కేసు విచారణ జరుగుతుండగా.. ఎట్టకేలకు ఇప్పుడు లాయర్‌కు శిక్ష విధిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.