- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
12th ఫెయిల్ హీరోతో క్యాబ్ డ్రైవర్ గొడవ!.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన యాప్ (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: 12th ఫెయిల్ హీరోతో క్యాబ్ డ్రైవర్ గొడవ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే ఓ చోటు నుండి మరో చోటుకు ప్రయాణించేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కారు బుక్ చేసుకున్న సమయంలో రూ.400 చూపించి, దిగే చోటు రాగానే ఆ యాప్ లో డబ్బు మరోలా చూపించింది. దీంతో మొదట చూపించిన డబ్బునే తానే చెల్లిస్తానని చెప్పగా.. క్యాబ్ డ్రైవర్ తన ఫోన్ లో వీడియో తీస్తూ వాదనకు దిగాడు.
విక్రాంత్ వీడియో ఎందుకు తీస్తున్నావ్ అని ప్రశ్నించగా.. ఆ డ్రైవర్ యాప్ తప్పుగా చూపించడం నా సమస్య కాదు. అది యాప్ సమస్య అని, నేను మిమ్మల్ని డ్రాప్ చేసినందుకు యాప్ చూపించినంత డబ్బు చెల్లించాల్సిందేనని గొడవ పెట్టుకున్నాడు. దానికి హీరో నేను నిన్ను తప్పపట్టడం లేదు. యాప్ లో చూపించినంత చెల్లిస్తాను అని చెబుతున్నాని దానికి వీడియో ఎందుకు తీస్తున్నావ్? అంటూ డ్రైవర్ చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మధ్య ప్రతి యాప్ లో ఇలాగే జరుగుతోంది. ఆ అనుభవం మాకు ఎదురైందని కొందరు అంటుండగా.. మరికొందరు ఈ వీడియో స్క్రిప్ట్‌డ్ అని.. ఇన్ డ్రైవ్ కార్స్ యాడ్ లో భాగంగా విడుదల చేసిన వీడియో అని కామెంట్లు పెడుతున్నారు.
कैब ड्राइवर और 12वीं फेल एक्टर विक्रांत मैसी के बीच हुई झड़प. वायरल हो रहा वीडियो. pic.twitter.com/27pENq0hna
— Priya singh (@priyarajputlive) May 9, 2024