- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్!
దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులందరూ శ్రీలంకకు చెందిన వారేనని ఏటీఎస్ అధికారులు తెలిపారు. వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు. వారిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే వారు శ్రీలంక నుంచి చెన్నయ్ మీదుగా అహ్మదాబాద్ వచ్చినట్టు సమాచారం. దేశంలో భారీ దాడి చేయడానికి కుట్రపన్నినట్టు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన అహ్మదాబాద్‌లోని 36 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పట్టుపడటం కలకలం రేపుతోంది.