Budget 2024: స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఉంటుందా?

by GSrikanth |   ( Updated:2024-02-01 04:44:53.0  )
Budget 2024: స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఉంటుందా?
X

దిశ, వెబ్‌డెస్: కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. మేలో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా నిర్ణయాలు తీసుకుంటానే అంచనాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహాలు నెలకొంటున్నాయి. వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మేజర్ పాలసీ రిఫార్మ్‌ను ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.

మరోవైపు ఈ బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 12 బడ్జెట్ సెషన్స్‌లో 10 బడ్జెట్ సెషన్స్ ప్రవేశపెట్టే రోజున స్టాక్ మార్కెట్లు అస్థిరతకు గురైన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రసంగం మొదలు కాగానే కుప్పకూలడం సంఘటనలు చూశాం. అందువలన డైరెక్షన్ స్ట్రాటజీ తీసుకోవడం కంటే అస్థిరత సమయంలో అనుసరించే వ్యూహాలు ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కొంత మేర అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Read More..

నేడే మధ్యంతర బడ్జెట్.. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు

Advertisement

Next Story

Most Viewed