- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు రవాణాకు పెద్దపీట.. బడ్జెట్‌లో రూ.2.78 లక్షల కోట్లు
దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని రోడ్ల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్ర సర్కారు అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈసారి చేసిన కేటాయింపులే దీనికి నిదర్శనం. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖకు ఈదఫా బడ్జెట్‌లో రూ.2.78 లక్షల కోట్లు దక్కాయి. ఇందులో మూలధన వ్యయం కోసం అత్యధికంగా రూ.2.72 లక్షల కోట్లను కేటాయించడం గమనార్హం. రెవెన్యూ వ్యయ విభాగానికి కేవలం రూ.5,758 కోట్లను అలాట్ చేశారు. రోడ్డు రవాణా విభాగానికి మూలధన వ్యయం కోసం గతేడాది రూ.2.58 లక్షల కోట్లను కేటాయించగా.. ఈదఫా అంతకుమించి రూ. 2.78 లక్షల కోట్లను అలాట్ చేశారు. దేశంలో హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణ పనులను స్పీడప్ చేసేందుకే బడ్జెట్ కేటాయింపులను పెంచినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విభాగానికి కేటాయింపులు మరింత పెరిగి రూ.3.30 లక్షల కోట్లకు చేరొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రోడ్డు రవాాణా శాఖకు మూలధన వ్యయం కోసం కేవలం రూ.1.13 లక్షల కోట్లను కేటాయించారు. అంటే గత రెండేళ్లలో ఈ శాఖకు కేటాయింపులు దాదాపు 82 శాతం పెరిగాయన్న మాట. గత తొమ్మిదేళ్ల వ్యవధిలో దేశంలో నేషనల్ హైవేల విస్తీర్ణం గణనీయంగా పెరిగి 91,287 కిలోమీటర్ల నుంచి 1.45 లక్షల కిలోమీటర్లకు చేరింది. 2025 నాటికి దేశంలో 2 లక్షల కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.