BREAKING: విపక్షాలు ఇంకా అదే స్థానంలో ఉండాలని తీర్మానించుకున్నాయేమో!.. లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోడీ సెటైర్లు

by Shiva |
BREAKING: విపక్షాలు ఇంకా అదే స్థానంలో ఉండాలని తీర్మానించుకున్నాయేమో!.. లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోడీ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సభలో విపక్షాలు ఇంకా అదే స్థానంలో ఉండాలని తీర్మానించుకున్నాయేమోనని ప్రధాని నరేంద్ర మోడీ సెటైర్లు వేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంగా ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 75 గణతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకున్నామని తెలిపారు. లోక్‌సభకు సెంగోల్ (రాజదండం) తీసుకొచ్చి కొత్త సాంప్రదాయాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

విపక్షాలు చాలాకాలం అదే స్థానంలో ఉండాలని తీర్మానించుకున్నాయని, అందుకు వారికి తన ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేశారు. కొంతమంది లోక్‌సభ సీటును కూడా మార్చుకున్నారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సారి వాళ్లు రాజ్యసభకు వచ్చే ఆలోచన ఉన్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీపై పోటీ చేసేందుకు విపక్ష నేతలు వణికిపోతున్నారని పేర్కొన్నారు. అందకే వారంతా దొడ్డిదారిన రాజ్యసభకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే.. ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.

దేశాన్ని విభజిండచమే ప్రతిపక్షాల లక్ష్యంగా కనిపిస్తోందని, ఇంకేంత కాలం ఈ పని చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు వారికి బుద్ధి చెప్పినా.. తీరు ఏ మాత్రం మారలేదని అన్నారు. వారందరి ఆలోచనా తీరు దేశం నిత్యం గమనిస్తూనే ఉందని తెలిపారు. టేప్ రికార్డర్‌లా తమ ప్రభత్వంపై పదే పదే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రధాన కారణమని, వారిని ఎదగనివ్వడం లేదంటూ చురకలంటించారు.

కాంగ్రెస్ తీరుతో దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉండి మంచి విపక్షంగా నిరూపించుకోలేకపోయిందని అన్నారు. ఎన్నికలొస్తున్నాయ్.. ఇప్పుడైనా కష్టపడండి అని పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ నుంచి రాజ్యసభకు మారారని, గులాంనబీ ఆజాద్ పార్టీ నుంచే షిఫ్ట్ అయిపోయారని, ఇక మిగతా కాంగ్రెస్ నేతలు కూడా కొత్త దుకాణాలు తెరుస్తున్నారని అన్నారు. వాళ్ల దుకాణాలు కూడా త్వరలోనే మూతపడబోతున్నాయని పేర్కొన్నారు.

నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని, కానీ వాళ్లే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదంటూ రాహుల్ మొహబత్‌ కీ దుకాన్‌పై మోదీ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆ దుకాణం కేవలం ఒక్క నాయకుడి కోసమేనని మోడీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తను వారసతవ రాజకీయాలు చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Advertisement

Next Story