BREAKING: హర్యానాలో హస్తం పార్టీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి రాజీనామా

by Shiva Kumar |
BREAKING: హర్యానాలో హస్తం పార్టీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానాలో హస్తం పార్టీకి బిగ్ షాక్ తగలింది. ఈ మేరకు ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి విజయం సాధించారు.. ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శృతి చౌదరి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను పట్టించుకోలేదని శృతి చౌదరి ఆరోపించారు. భివానీ-మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం నుంచి తన కుమార్తెకు లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని కిరణ్ చౌదరి కోరింది. అందుకు పార్టీ నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story